ఉంగరాలు మార్చుకుందామా లేక ఊసులతో ఆపేద్దామా?
ఏడడుగులు వేద్దామా లేక మధ్యలో ప్రేమనడకని ఆపేద్దామా?
జీవితాంతం కలిసుందామా??
లేక లేఖలు రాసుకుని ప్రేమని కడతేర్చుదామా??
మౌనమే నీ మార్గమైతే నా మది ని విడిచి వెళ్లిపో,
కళ్ళలో నీరు కరిగించి వాటితో కలిసిపో
కన్నీరు ఏరులై పారితే వచ్చి వెళ్లే వరదలా నన్ను వీడిపో!!!